అంతర్జాతీయం

డోర్ బెల్ మోగించిన మొసలి.. వీడియో

మొసలి మీ ఇంటికి వచ్చి మీ ఇంటి డోర్‌కు ఉన్న బెల్ మోగించిందనుకోండి.. ఏం చేస్తారు. డోర్ తీస్తారా? ఒకవేళ మొసలే డోర్ బెల్ మోగించిందని తెలిస్తే చచ్చినా డోర్ తీయరు. ఒకవేళ ఎవరైనా వచ్చారేమో అనుకొని డోర్ తీస్తారు. కానీ.. అసలు.. మొసలి డోర్ బెల్ మోగించడం ఎక్కడైనా చూశారా? ఈ విచిత్రం యూఎస్‌లోని సౌత్ కరోలినాలో చోటు చేసుకున్నది.

కరెన్ అల్ఫానో అనే మహిళ ఇంటి ముందుకు వచ్చిన ఓ మొసలి ఇలాగే డోర్ బెల్ మోగించింది. ఆ డోర్ బెల్ మోగించడానికి ఆ మొసలి చాలా తిప్పలు పడింది. దాదాపు ఆరున్నర అడుగులు ఉంది ఆ మొసలి. పెద్ద మొసలే. మనిషి కనిపిస్తే అవలీలగా చంపేయగలదు.

అయితే.. డోర్ కిటికీ గుండా చూస్తే బెల్ కొట్టింది మనిషి కాదు.. మొసలి అని తెలుసుకొని విస్తుపోయింది ఆ మహిళ. వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి దాన్ని బంధించి తీసుకెళ్లారు. అప్పటి వరకు ఆ మహిళ డోర్ తీస్తే ఒట్టు. ఇక.. ఆ మొసలి డోర్ బెల్ మోగించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.