ఆంధ్రప్రదేశ్

డిఇడి ప‌రీక్ష‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌..

చీరాల : పేరాల ఏఆర్ఎం ఉన్న‌త పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో శ‌నివారం డిఇడి 2018ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప‌రీక్ష‌ల‌కు 149మంది అభ్య‌ర్ధుల‌ను కేటాయించారు. వీరిలో 141మంది అభ్య‌ర్ధులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఎనిమిది మంది గౌర్హాజ‌ర‌య్యారు. వీరిలో 7గురు రెగ్యుల‌ర్ విద్యార్ధులు కాగా ఒక‌రు పూర్వ విద్యార్ధి. ప‌రీక్ష‌ల‌ను ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు లేకుండా నిర్వ‌హించారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్చూరు డిప్యూటి డిఇఒ వి శ్రీ‌నివాస‌రావు, ప‌రీక్ష‌ల చీఫ్ కె వీరాంజ‌నేయులు, డిపార్టుమెంట‌ల్ ఆఫీస‌ర్ సాల్మ‌న్‌రాజు, ప‌రీక్ష‌ల ప‌ర్య‌వేక్ష‌ణ అధికారిణి డి ర‌త్న‌కుమారి ప‌ర్య‌వేక్షించారు. ప‌రీక్ష జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించారు.