జాతీయం

ట్విటర్‌లో ‘రిపోర్ట్‌’ చేయొచ్చు!

దిల్లీ: ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ తన ఖాతాదారులకు అదనపు ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటర్లను తప్పుతోవ పట్టించేలా ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే రిపోర్ట్‌ చేయగలిగేలా ఈ ఫీచర్‌ను రూపొందించింది. ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది.