వైద్యం

ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌తో గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట‌..!

నిత్యం ట్రాఫిక్‌లో చిక్కుకుని గమ్య‌స్థానాల‌కు త్వ‌ర‌గా చేరుకోవాల‌ని ఆందోళ‌న ఉన్న‌వారికి గుండె జ‌బ్బులు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. గ‌మ్య‌స్థానాల‌కు వేగంగా చేరుకుంటామా, లేదా అన్న ఆందోళ‌న‌తోపాటు, ట్రాఫిక్‌లో వాహ‌నాలు చేసే చ‌ప్పుళ్ల‌కు తీవ్ర ఒత్తిడికి గురై గుండె స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక ర‌ద్దీ లేని స‌మ‌యాల్లో ర‌హ‌దారుల‌పై వెళితే ఆందోళ‌న‌ను త‌గ్గించుకోవ‌డంతోపాటు గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.