అంతర్జాతీయం

ట్రంప్ హెచ్చ‌రిక.. మార్కెట్లు కుదేల్‌

హైద‌రాబాద్: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రిక‌లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను కుదేలు చేశాయి. వాణిజ్య విధానంలో భాగంగా చైనాపై కొత్త ఆంక్ష‌ల‌ను విధించ‌నున్న‌ట్లు ట్రంప్ ఇటీవ‌ల హెచ్చ‌రించారు. దీంతో ఇవాళ చైనాతో పాటు యూరోప్ మార్కెట్లు డౌన‌య్యాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్ర‌క‌టించ‌డంతో.. అమెరికాతో చ‌ర్చించేందుకు చైనా అధికారులు వాషింగ్ట‌న్ వెళ్ల‌నున్నారు. భార‌త్‌లోనూ ఇవాళ సెన్సెక్స్ కూడా 362.92 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్‌లో ట్రేడింగ్ 38 వేల 600 పాయింట్ల వ‌ద్ద ముగిసింది.