ఆంధ్రప్రదేశ్తెలంగాణ

టీవీ-5 ఛానల్ ను నిషేధిస్తున్నాం.. ఆ ఛానల్ కార్యక్రమాలకు వెళ్లవద్దు!: నేతలకు వైసీపీ ఆదేశం

  • ప్రెస్ మీట్లు, కవరేజీలపై కూడా నిషేధం
  • అధికారిక ప్రకటన జారీచేసిన వైసీపీ
  • టీడీపీకి అనుకూలంగా మారారని ఆగ్రహం

అధికార టీడీపీకి అనుకూలంగా కథనాలు ప్రసారం చేస్తున్నందున టీవీ-5 ఛానల్ ను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. టీవీ-5 ఛానల్ లో జరిగే కార్యక్రమాల్లో వైసీపీ నేతలు ఎవరూ పాల్గొనరాదని ఆదేశాలు జారీచేసింది. అలాగే పార్టీ ప్రెస్ మీట్లు, కార్యక్రమాల కవరేజీలో టీవీ-5 ఛానల్ ను నిషేధిస్తున్నామని తెలిపింది.
స్వతంత్ర జర్నలిజం ముసుగులో ఎల్లోమీడియాగా మారిన ఛానళ్లను బట్టబయలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఈరోజు ఓ ప్రకటనను విడుదల చేసింది. వైసీపీ ఇప్పటికే ఆంధ్రజ్యోతి ఛానల్, పత్రికపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.