క్రీడలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా

ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఓవల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఇందులో భాగంగా కోహ్లీసేన టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టి జోరు మీదున్న భారత జట్టు కంగారూలను కట్టడి చేయాలని చూస్తోంది. మరోవైపు వరుస విజయాలతో జోరు మీదున్న ఫించ్‌ సేన హ్యాట్రిక్‌పై కన్నేసింది.