అంతర్జాతీయం

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్

ప్రపంచకప్‌ మెగాటోర్నీలో భాగంగా మూడో రోజు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. కార్డిఫ్‌ వేదికగా మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో కివీస్ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వార్మప్‌ మ్యాచ్‌ల్లో అదరగొట్టి జోరుమీదున్న కివీస్‌ శుభారంభం కోసం ఆరాటపడుతోంది. మరోవైపు పటిష్ఠ బ్యాటింగ్‌ లైనప్‌తో ఉన్న లంక జట్టు..మెగాటోర్నీలో తొలి విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.