జాతీయంవ్యాపారం

జెట్‌ విమానాలపై ఎయిర్‌ఇండియా ఆసక్తి

ముంబయి: ఎయిర్‌ ఇండియా అంతర్జాతీయ మార్గాలను చూసే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంక్షోభంలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానాలను లీజుకు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ విమానాలకు చెల్లింపులు జరపకపోవడంతో పలు విమానాశ్రయాల్లో నిలిపి ఉంచారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కంపెనీ అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్‌ 16వ తేదీనాటికి జెట్‌సంస్థ మొత్తం విమానాలను పక్కనపెట్టింది. దీంతో ఆ సంస్థ నుంచి దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోయాయి.  దీంతో జెట్‌కు చెందిన విమానాలను తీసుకునే అంశాన్ని ఎయిర్ ఇండియా ఇప్పటికే చర్చించింది. దీని కింద ఐదు 777 విమానాలను తీసుకొనే అవకాశం ఉంది. ‘‘మేము విమానాలను లీజుకు తీసుకుందాం అనుకుంటున్నాం. కానీ దీనిపై ఎటువంటి చర్చలు జరగలేదు. ఈ విషయం వివిధ అంశాలతో ముడిపడి ఉంది. ’’ ఎయిర్‌ ఇండియా ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ శ్యామ్‌ కె సుందర్‌ పీటీఐకి తెలిపారు.