జాతీయం

జమ్ము కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

కిష్టావర్ : జమ్ము కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 9.55 గంటల సమయంలో కిష్టావర్ జిల్లాలోని థాక్రీ వద్ద25మందితో వెళ్తున్న  జేకే17 0662 రిజిస్ట్రేషన్ కలిగిన ఓ మినీ బస్సు అదుపు తప్పి చెనబ్ నదిలో పడిపోవడంతో 11మంది మృతి చెందగా మంది ప్రాణాలు కోల్పోయారు. 8మంది మృతదేహాలను వెలికితీశారు. ఓ ఐదేళ్ల బాలుడు తీవ్ర గాయాలతో భయటపడ్డాడు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.