ఆంధ్రప్రదేశ్

జనసేన అధినేత కంటికి మళ్లీ గాయం..

ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత  పవన్ కల్యాణ్ కంటికి మళ్లీ గాయం అయినట్లు తెలుస్తోంది… కంటి సమస్యతో కొంతకాలం తీవ్ర ఇబ్బంది పడిన పవన్ కల్యాణ్… ఎక్కడికి వెళ్లినా నల్లటి అద్దాలతో కనిపించారు… అనంతరం కంటికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. అయితే నిన్న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు సభలో భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఆయనపై పువ్వుల వర్షం కురిపించడంతో పాటు… జెండా, టవల్స్ ఆయనపైకి విసిరారు… అలా విసిరిన జెండాలు, టవల్ తగలడంతో మళ్లీ గాయమైంది. ఇవాళ ఉదయం డాక్టర్లు వచ్చి ఆయనకు వైద్య సహాయం అందించారు.