ఆంధ్రప్రదేశ్

జనసేనలో చేరిన టీడీపీ కీలక నేత

పెనుగొండ/ఏలూరు: మాజీ ఎమ్మెల్సీ, పెనుగొండ మాజీ ఎంపీపీ, టీడీపీ రాష్ట్రస్థాయి మాజీ నాయకుడు మల్లుల లక్ష్మీనారాయణ గురువారం జనసేన పార్టీలో చేరారు. ఏలూరులో జనసేన అధి నేత పవన్‌కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో మల్లుల చేరారు. ఆయనతో పాటు సిద్ధాంతం సొసైటీ అధ్య క్షుడు కలగ ప్రసాద్‌ జనసేనలో చేరారు.
మల్లుల తెలుగుదేశంలో బలమైన నాయకుడిగా ఎదిగి రాష్ట్రస్థాయిలో పార్టీ పదవులు, ఎంపీపీ, ఎమ్మెల్సీగా పనిచేశారు. పెనుగొండ అసెంబ్లీ స్థానానికి గతంలో పోటీచేసి ఓటమి చవిచూశారు. తర్వాత వైసీపీ చేరినా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా లేరు. చివరకు జనసేనలో చేరారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మల్లుల చేరికతో ఆచంట నియోజకవర్గంలో జనసేనకు బ లం లభించిందని జనసేన కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. గురువారం ఉదయం పెనుగొండ మీదుగా ర్యాలీగా ఏలూరు వెళ్లి జనసేనలో చేరారు