ఆంధ్రప్రదేశ్

జగన్ చేయాల్సింది కాశీ యాత్ర..

జగన్ చేయాల్సింది పాదయాత్ర కాదనీ… ఆయన కాశీ యాత్ర చేయాలని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు ఎద్దేవ చేశారు. ప్రాజెక్టుల విషయంలో ఆయన అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
జగన్  చేష్టలు భరించలేక 23శాసన సభ్యులు పార్టీ మారారని విమర్శించారు . వైసీపీ నేతలు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కొత్త రాష్ట్రం పాలనకు సహరించాల్సింది పోయి ఇష్టమొచ్చిన రీతిలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని దేవినేని ఆరోపించారు. అక్టోబర్ రెండో వారంలో జిల్లాలో సిఎం పర్యటిస్తారని తెలిపారు.  భ్తెరవానితిప్పా ప్రాజెక్టు పనులకు భూమి పూజ చేయనున్నారని స్పష్టం చేశారు.