జాతీయం

జగన్‌కు మోదీ అభినందనలు

దిల్లీ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రియమైన జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన మీకు అభినందనలు. మీ పదవికాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే నా శుభాకాంక్షలు’ అని మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు.

అటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజు జనతాదళ్‌  పార్టీ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఒడిశాలో మరోసారి విజయం సాధించిన నవీన్‌ బాబుకు అభినందనలు. మీ పదవీకాలం మరింత విజయవంతం కావాలి’ అని ఒడియా బాషలో మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.