క్రైమ్జాతీయం

చెన్నై నగర శివారులో భారీ అగ్నిప్రమాదం

చెన్నై: బెంగళూరులో నిన్న ఎయిర్‌షోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని 300కిపైగా కార్లు దగ్ధమైన ఘటన మరవకముందే చెన్నైలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. నగర శివారులోని పోరూర్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 300లకు పైగా కారులు దగ్ధమయ్యాయి. స్థానిక ప్రైవేటు పార్కింగ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఐదు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

పోరూరులోని రామచంద్ర హాస్పిటల్‌ సమీపంలో ఉన్న ఓటో టాక్సీ కంపెనీకి చెందిన కార్లను పార్కింగ్‌ చేసే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న రసాయన వ్యర్థాల డంపింగ్‌ యార్డ్‌లో మంటలు అంటుకుని ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లు సమాచారం. ఈ మంటలు కార్ల పార్కింగ్‌ ప్రాంతం వరకూ వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. డంపింగ్‌ యార్డ్‌లో చెరకు పిప్పి పెద్ద ఎత్తున ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.