ఆంధ్రప్రదేశ్క్రైమ్

చెట్టును ఢీకొన్న బస్సు: 17 మందికి గాయాలు

చిత్తూరు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎం.బండపల్లి వద్ద  ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమదంలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రావెల్స్‌ బస్సు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.