తెలంగాణ

చింతమడకలో KCR.. బంజారాహిల్స్‌లో KTR

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో గ్రామానికి చేరుకున్న కేసీఆర్‌ దంపతులు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. మరోవైపు కేసీఆర్‌ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ బంజారాహిల్స్‌లో నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో ఓటుహక్కు వినియోగించుకున్నారు. సతీమణి శైలిమ కూడా ఆయన వెంట ఉన్నారు.