ఆంధ్రప్రదేశ్

చాలా చోట్ల 300కు మించి ఓట్లు రాలేదు

ఆంధ్రప్రదేశ్‌లోని 22 శాసనసభ నియోజకవర్గాల్లో వైకాపా రంగంలోకి దింపిన అభ్యర్థుల పేర్లతో పోలిన పేర్లు గల వారినే తమ అభ్యర్థులుగా ప్రజాశాంతి పార్టీ బరిలోకి దింపినా ఎటువంటి ప్రభావం కనపడలేదు. ఈ పార్టీకి కేటాయించిన హెలీకాఫ్టర్‌ గుర్తులోని ఫ్యాన్‌ రెక్కలు, వైకాపా ఫ్యాన్‌ గుర్తు రెక్కలు ఒకేలా ఉండటంతో పాటు, పేర్లలో పోలిక ఉండడంతో వైకాపా శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ఆ పార్టీ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. అయితే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు అత్యధికంగా ఆలూరులో 1327 ఓట్లు రాగా… పలమనేరులో 1107, ఒంగోలులో 400, పెనమలూరులో 300, జమ్మలమడుగులో అత్యల్పంగా 119 ఓట్లే వచ్చాయి.  మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా 300కు మించి ఓట్లు రాలేదు. డిపాజిట్లు కూడా దక్కలేదు.