సినిమా

చరణ్ బర్త్ డే రోజు సెట్స్ పైకి బన్నీ?

  • బన్నీ19వ సినిమాకి రంగం సిద్ధం
  • ఈ నెల 27న షూటింగు మొదలు
  • హ్యాట్రిక్ హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్

అల్లు అర్జున్ 19వ సినిమాకి రంగం సిద్ధమైంది. ఆయన ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడం కోసమే చాలా కాలంగా ఆయన వెయిట్ చేస్తూ వచ్చాడు. ఈ కారణంగానే త్రివిక్రమ్ కూడా ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఇది క్రేజీ కాంబినేషన్ కావడంతో, సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందా అని అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగును ఈ నెల 27వ తేదీన ఆరంభించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ రోజున చరణ్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనను అల్లు అర్జున్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. చరణ్ .. బన్నీ మధ్య ఎంతటి అనుబంధం .. ఆత్మీయత వున్నాయనే సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ – హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాతో, త్రివిక్రమ్ .. బన్నీ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు.