ఆంధ్రప్రదేశ్జాతీయం

చంద్రబాబు మేనల్లుడు కన్నుమూత

  • నేడు చిత్తూరు జిల్లాలో అంత్యక్రియలు
  •  హాజరుకానున్న సీఎం, నందమూరి కుటుంబ సభ్యులు
హైదరాబాద్‌ సిటీ, తిరుపతి అర్బన్‌, డిసెంబరు 14(స్నేహ టీవీ ): ఏపీ సీఎం చంద్రబాబు మేనల్లుడు కె.ఉదయకుమార్‌(43) శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు. శ్రీనగర్‌లో నివసిస్తున్న ఉదయకుమార్‌ని అపస్మారక స్థితిలో ఉండగా బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. గుండెపోటుతో అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. చంద్రబాబు రెండో సోదరి కొడుకు ఉదయకుమార్‌. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్పత్రికి వచ్చారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో మృతదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంటకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో కందులవారిపల్లెకు తరలించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కనుమూరి ఉదయ్‌కుమార్‌ కేసీబీఎన్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ పేరుతో కంపెనీని నడుపుతున్నారు. ఈయనకు భార్య సింధూర, కుమార్తె వన్షిక ఉన్నారు. శనివారం జరిగే ఉదయ్‌కుమార్‌ అంత్యక్రియలకు ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు లోకేష్‌, నందమూరి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు