ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ రాబోతోంది… అది ఇదే: సాధినేని యామిని!

  • ‘పసుపు-కుంకుమ’ ద్వారా మహిళల మనసు గెలుచుకున్నారు
  • తిరిగి సీఎంను చేయడం ద్వారా మహిళలు బహుమతి ఇస్తారు
  • టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని

ఎంతో అద్భుతమైన ‘పసుపు-కుంకుమ’ పథకం ద్వారా లక్షల మంది మహిళల మనసులను చంద్రబాబునాయుడు గెలుచుకున్నారని, వారంతా తమ నేతను తిరిగి సీఎంను చేయడం ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి యామినీ సాధినేని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, వైఎస్ జగన్ మహిళా ద్రోహని, ఆయనకు తెలుగు ఆడపడుచులు తగిన గుణపాఠం చెప్పనున్నారని ఆయన కోసం చెంపపెట్టులాంటి సమాధానాన్ని సిద్ధం చేసుకున్నారని అన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను టీడీపీ సర్కారు ప్రవేశపెట్టిందని, ఈ క్షణం మహిళాలోకం యావత్తూ చంద్రబాబుకు అండగా నిలిచిందని అన్నారు. మడమ తిప్పడంలో ముందున్న పార్టీ వైసీపీయేనని, పక్క రాష్ట్రంలోని కేసీఆర్, కేంద్రంలోని దుర్మార్గుడైన మోదీతో కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శలు గుప్పించారు.