సినిమా

గోపీచంద్‌ సినిమా.. ఆసక్తికరమైన టైటిల్‌

ప్రముఖ నటుడు గోపీచంద్‌ నటిస్తున్న 26వ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సినిమాకు ‘చాణక్య’ అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మెహరీన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ‘పంతం’ సినిమా తర్వాత గోపీచంద్‌, మెహరీన్‌ జంటగా నటిస్తున్న సినిమా ఇది. తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విశాల్‌ శేఖర్‌ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.