అంతర్జాతీయం

గృహరుణాలపై మధ్యతరగతికి ఊరట

దిల్లీ: మధ్య తరగతి ప్రజల గృహ రుణాలపై మరికాస్త ఊరటనిస్తూ కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు కల్పించారు. రూ.45 లక్షల లోపు గృహ రుణాలపై వడ్డీ రాయితీని పెంచారు. ప్రస్తుతం గృహ రుణాలపై రూ. 2 లక్షల వరకు వడ్డీ రాయితీ ఉండగా.. దాన్ని రూ. 3.50 లక్షల వరకు పెంచుతున్నట్లు సీతారామన్‌ వెల్లడించారు.