జాతీయంతెలంగాణ

గుట్కా స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్ : టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్కా స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. గుజరాత్ నుంచి హైదరాబాద్ కు గుట్కా స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్కా విలువ రూ.కోటిన్నర ఉంటుందని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. వివిధ రకాల కంపెనీల పేర్లతో ఉన్న గుట్కా ప్యాకెట్లు, ఉత్సత్తులను సీజ్ చేసినట్లు తెలిపారు.