సినిమా

కౌశల్ కంటే ముందే ఈ బిగ్‌బాస్ తారకు ఆర్మీ ఉంది..!

  • ఓవియా.. నీ క్లియోపాత్ర ఆవియా…!
బిగ్‌బాస్‌ రియాల్టీ షో తరువాత మలయాళ తార ఓవియా ఇమేజ్‌ అమాంతంగా పెరిగిపోయింది. బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్నప్పుడే ఆమెకు మద్దతుగా ఒక ఆర్మీనే ఏర్పడింది. అలా దక్షిణాదిలో సెలబ్రిటీలకు ఆర్మీ ట్రెండ్‌ మొదలైంది. దీంతో సోషల్‌ మీడియా లేదా పబ్లిక్‌గా ఓవియా ఏం చేసినా సెన్సేషన్‌ అవుతోంది. ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలనే ఉద్దేశంతో బిగ్‌బాస్‌కు వెళ్లకముందే ఓవియా కమిటైన ‘శీని’ చిత్రానికి ఆ తరువాత ‘ఓవియా విట్టా యారు’ అన్న టైటిల్‌ పెట్టారు. ఇప్పుడు పృథ్విపాండి యరాజన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గణేశా మీండుమ్‌ సందిప్పోమ్‌’ అనే చిత్రంలో ఓవియా హీరోయిన్‌గా నటిస్తోంది.

హరిగీతా పిక్చర్స్‌ బ్యానర్‌పై అరుణ్‌ విక్రమ్‌కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రతీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శిబి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రచారం ముమ్మరం చేశారు. ఆ సందర్భంగా ‘వియా.. వియా.. ఓవియా.. నీ క్లియోపాత్రా ఆవియా..’’ అంటూ సాగే పాటను విడుదల చేయగా, కొద్దిసేపట్లోనో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. కాగా తెలుగు బిగ్‌బాస్‌-2 కంటెస్ట్ కౌశల్‌కు కూడా పెద్ద ఎత్తున అభిమానులు ‘కౌశల్ ఆర్మీ’ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు కౌశల్ ఆర్మీ పేరుతో 2కే రన్ కూడా నిర్వహించారు. అయితే కౌశల్ కంటే ముందుగా ఓవియాకు కూడా ఆర్మీ ఉందన్న సంగతి చాలా ఆలస్యంగా తెలిసింది.