క్రీడలు

కోహ్లీ ‘రాంగ్’ ట్రైలర్ లాంచ్..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ కొత్త ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నానంటూ ట్విట్టర్ వేదికగా కొన్నిరోజుల క్రితమే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం విరాట్ కోహ్లీ ‘ట్రైలర్ ద మూవీ’కి సంబందించిన ట్రైలర్ ను లాంచ్ చేసాడు. ఈ మేరకు కోహ్లీ తన ట్విట్టర్‌ అకౌంట్లో షేర్ చేశాడు. ‘పోస్టర్ లో సరైన తేదీనే ప్రకటించాం’ అని కోహ్లీ తెలిపాడు. ‘ట్రైలర్ ది మూవీ’ అనేది పూర్తి సినిమానా లేక షార్ట్ ఫిల్మా లేక బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిన యాడా అనేది తెలియడం లేదు.
సెప్టెంబర్ 28న విరాట్ ‘ట్రైలర్ ద మూవీ’ విడుదల కాబోతోంది. ట్రైలర్ అనేది సినిమానా లేక ప్రమోషనల్ వీడియోనా అనేది అర్ధం కావడం లేదు. విరాట్ సొంత వస్త్ర దుకాణాల బ్రాండ్ ‘రాంగ్’ కోసం వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ‘ట్రైలర్ ది మూవీ’ అనేది ఏంటో తెలియాలంటే సెప్టెంబర్ 28 వరకూ ఆగాల్సిందే.