తెలంగాణ

కేసీఆర్‌ నోరు పడిపోయిందా: లక్ష్మణ్‌

విద్యార్థులు చనిపోతున్నా స్పందించని సీఎం కేసీఆర్‌కు నోరు పడిపోయిందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రశ్నించారు. నల్లగొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. గ్లోబరీనా సంస్థ తప్పిదం వల్లే పొరపాట్లు జరిగాయని త్రిసభ్య కమిటీ తేల్చినా చర్యలు తీసుకోలేదన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 15, 16 తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపడతామన్నారు.