తెలంగాణ

కేసీఆర్‌పై బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో  చేరిన సినీ నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పరిపాలనాదక్షుడు కాదని.. వాగ్ధానాలు నిలబెట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్ అంటే తనకు భయం లేదని.. భయపడుతూ ఆయనపై విమర్శలు చేయడం లేదనే వార్తలు సరికాదన్నారు. ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమంటూ బండ్ల జోస్యం చెప్పారు. 14 ఏళ్ల పోరాటం చేసి.. కాంగ్రెస్ పార్టీని ఒప్పించి.. పార్టీని ఆ దిశగా అడుగులు వేయించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అయినప్పటికీ.. జనానికి మాత్రం చేరువలో లేరన్నారు.