తెలంగాణ

కీలక నేత రాజీనామా, కూకట్‌పల్లిలో టీఆర్ఎస్‌కు షాక్..

స్నేహ,హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిముక్కల పద్మారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని తన ఇల్లులా, కేసీఆర్‌ను తన తండ్రిలా భావించానని, తనతోపాటు చాలామందికి పార్టీలో తీరని అన్యాయం జరిగినా ఓపికగా మార్పుకోసం ఎదురుచూశానన్నారు. కేసీఆర్‌ తెలంగాణ వాదాన్ని పూర్తిగా మరిచి పోయారని, పార్టీ పక్కదారి పడుతోందని, ఇప్పట్లో గాడిలో పడే పరిస్థితి కనిపించడం లేదని భావించి తన క్రియాశీలక సభ్యత్వానికి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.