క్రైమ్

కిడారి భార్య : తన భర్తతో సరదాగా మాట్లాడిన చివరిమాటలే నిజమయ్యాయయి..

తన భర్తతో సరదాగా మాట్లాడిన చివరిమాటలే నిజమయ్యాయని భోరున విలపిస్తున్నారు హత్య కావించబడ్డ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సతీమణి కిడారి పరమేశ్వరి. గ్రామదర్శిని కార్యక్రమానికి బయలుదేరే ముందు తన భర్త చేసిన చివరి ఫోన్ కాల్ ను గుర్తు చేసుకుంటూ ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు. సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం ఉండటంతో తాను విశాఖపట్నం వచ్చానని, ఆ సందర్భంలో భర్తకు ఫోన్ చేయగా, ఆయన కూడా వస్తున్నానని చెప్పారని ఆమె అన్నారు. బదులుగా.. ‘నీవలాగే అంటావ్ ఎక్కడొస్తావులే’ అన్నానని ఆ మాటలే నిజమయ్యాయని ఆమె వాపోయారు. డ్రైవర్ ఫోన్ చేసి, సార్ ను నక్సల్స్ చంపేశారని చెప్పగానే తనకేమీ తోచలేదని, సహాయం కోసం స్నేహితుల ఇంటికి పరుగులు తీశానని.. కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేశానని తెలిపారు. నక్సల్స్ నుంచి తనకు ముప్పు ఉందన్న విషయాన్ని భర్త ఎన్నడూ చెప్పలేదని, ఆ విషయం ఎప్పుడూ తమ మధ్య చర్చకే రాలేదని పరమేశ్వరి అన్నారు.