అంతర్జాతీయం

కింగ్స్‌ ఎలెవన్‌ లక్ష్యం 177

మొహాలి: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ అదరగొట్టింది. ప్రత్యర్థికి 177 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఓపెనర్‌ క్వింటన్ డికాక్‌ (60; 39 బంతుల్లో 6×4, 2×6) అర్ధశతకం సాధించాడు. రోహిత్‌ శర్మ (32; 18 బంతుల్లో 5×4) మెరుపు ఆరంభం అందించాడు. అతడు జట్టు స్కోరు 51 వద్ద ఔటయ్యాడు. మరో 10 పరుగులకే సూర్య యాదవ్‌ (11) పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో యువరాజ్‌ (18; 22 బంతుల్లో 2×4) వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. మందకొడిగా ఉన్న పిచ్‌పై నిలకడగా ఆడాడు. అప్పటికే నిలదొక్కుకున్న డికాక్‌ చెలరేగేందుకు అవకాశం దొరికింది. ఇక చివర్లో హార్దిక్‌ పాండ్య (31; 19 బంతుల్లో 3×4, 1×6) తనదైన శైలిలో దుమ్మురేపాడు. దాంతో ముంబయి 176/7 పరుగులు చేయగలిగింది. మురుగన్‌ అశ్విన్‌, షమి, విల్‌జోయిన్‌ తలో రెండు వికెట్లు తీశారు.