జాతీయంతెలంగాణ

కారును పోలిన గుర్తులివ్వొద్దు: కేసీఆర్‌

దిల్లీ: హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్వచన్‌ సదన్‌లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాతో భేటీ అయ్యారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలతో పాటు పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఇస్త్రీ పెట్టె, ట్రక్కు వంటి కారును పోలిన గుర్తులను రద్దు చేయాలని ఈసీని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు వల్ల తెరాసకు నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఓటర్ల జాబితాలో సవరణలు చేయాలని సునీల్‌ అరోరాను కోరినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో కేసీఆర్‌ వెంట ఎంపీలు వినోద్‌ కుమార్‌, బండా ప్రకాశ్‌ ఉన్నారు.