తెలంగాణ

ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు అమలు కాని హామీలు ఇస్తున్నారు: నాయిని

హైదరాబాద్: ఓటర్ లిస్ట్‌లో లోపాలు ఉంటే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి.. కానీ కోర్టుకు పోవడంలో అర్థం లేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషన్ సుప్రీం. ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇస్తోందని విమర్శించారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నేతల మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతలు జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి. మర్రి శశిధర్‌రెడ్డికి దమ్ముంటే తలసాని మీద గెలవాలని నాయిని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని నాయిని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల మెడలు వంచి తెలంగాణ సాధించామని తెలిపారు.

మూడు సీట్ల కోసం కోదండరాం తన పరువు తానే తీసుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. అమరవీరుల గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడటం ఏంటీ? అని మండిపడ్డారు. హౌజింగ్ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ పలు అవకతవకలకు పాల్పడ్డారు. ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్. రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్. ఐదు సీట్లున్న బీజేపీ అధికారంలోకి వస్తామని కలలు కంటోంది. ఉన్న సీట్లు కూడా బీజేపీకి రావని సర్వేలు చెబుతున్నాయి. మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్సే. బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకున్న కాంగ్రెస్‌కు మహిళలు తగిన బుద్ధి చెప్పారని మండిపడ్డారు.