ఆంధ్రప్రదేశ్

ఓటుకు నోటు కేసుకు సంబంధం ఉన్న నేపథ్యంలోనే హఠాత్తుగా..

ఏపీలో ఐటీ దాడులకు, రేవంత్ రెడ్డి…ఓటుకు నోటు కేసుకు సంబంధం ఉన్న నేపథ్యంలోనే హఠాత్తుగా ఈ రైడ్స్ జరిగాయని భావిస్తున్నారు. ఈ కేసులో పట్టుబడిన నగదును ఏపీ నేతలే అందించారని వచ్చిన ఆరోపణల పర్యవసానంగా ఐటీ అధికారులు ఈ దాడులకు దిగినట్టు తెలుస్తోంది. ఇరిగేషన్ కాంట్రాక్టుల్లో భారీగా ముడుపులు దండుకున్నారనే అభియోగాలు ఎదుర్కొన్న ఓ మంత్రి ద్వారానే ఈ సొమ్మును తెలంగాణకు పంపారన్న ప్రచారం జరిగింది. ఆ మధ్య కర్నాటక, తాజాగా తెలంగాణా ఎన్నికలకు కూడా ఏపీ నుంచే వందల కోట్లు తరలించారని ఏపీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐటీ సిబ్బంది గురువారం రాత్రి పోలీసుల సహకారం తీసుకున్నట్టు సమాచారం.

కాగా-సదరన్ డెవలపర్స్, వీఎస్ లాజిస్టిక్స్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. వీఎస్ లాజిస్టిక్స్ సంస్థ గుంటూరులో రైల్వే కోచ్ ల మరమ్మతులు, రైల్వే నిర్మాణ పనులకు సంబందించిన కాంట్రాక్టులు చేస్తోంది. విశాఖ, హైదరాబాద్, గుంటూరులోని ఈ రెండు సంస్థల కార్యాలయాలతో బాటు ఈ సంస్థలకు చెందిన ప్రతినిధుల ఇళ్ళలోనూ తనిఖీలు జరిగాయి. అమరావతి, పోలవరం కాంట్రాక్టుల్లో సబ్ -కాంట్రాక్ట్ పనులను సదరన్ డెవలపర్స్ చేజిక్కించుకున్నట్టు చెబుతున్నారు.