ఆంధ్రప్రదేశ్

ఓటమి భయంతోనే వైకాపా దౌర్జన్యాలు :సీఎం

అమరావతి: రాష్ట్రంలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో వైకాపా నేతలు చేస్తున్న దౌర్జన్యాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. తాడిపత్రిలో తెదేపా నేత సిద్దా భాస్కరరెడ్డి హత్య, సత్తెనపల్లిలో సభాపతి కోడెల శివప్రసాదరావుపై దాడి, రాప్తాడులో వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతుండడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు ఈ దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. తెదేపా ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రాకుండా చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని సీఎం ఆరోపించారు. ఏం జరిగినా ప్రజలు ఓటుతోనే వైకాపాకు బుద్ధి చెప్పాలని సీఎం పిలుపునిచ్చారు.