క్రీడలు

ఐబీ క్రికెట్‌ను ఆడతారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌ : గల్లీ క్రికెట్‌ ఆడి బోరు కొట్టిందా? అయితే మీరూ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానంలో అడుగు పెట్టేయండి. కోహ్లీ కవర్ డ్రైవ్‌, రోహిత్‌ శర్మలా కట్‌ షాట్‌, ధోనీలా హెలీకాప్టర్‌ షాట్‌, వార్నర్‌లా స్విఫ్ట్‌ షాట్‌ ఆడండి.  మీరు కొట్టే సిక్స్‌లు, ఫోర్లకు ప్రేక్షకుల చప్పట్లు, కేరింతలు చీర్‌ లీడర్ల విన్యాసాలు.. ఇలా ఎన్నో ఆస్వాదించొచ్చు. ఇదంతా నాలుగు గోడల మధ్యే. కానీ ఓ వీఆర్‌ హెడ్‌సెట్‌ ధరించి చేతిలో బ్యాట్‌ పెట్టగానే మీరున్న చోటును మరిచిపోయి.. అంతర్జాతీయ క్రీడాకారుడిగా మారిపోతారు.  అటువంటితే విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐబీ క్రికెట్‌ స్టేడియం. అందులోని విశేషాలు ఈ కింది వీడియోలో..