ఆంధ్రప్రదేశ్

ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వండి: జగన్

విశాఖ: ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వండి…ప్రతి కుటుంబాన్ని లక్షాధికారులను చేస్తానని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. దేవుడి దయ, మీ అందరి మద్దతుతో ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పాదయాత్రలో 13 జిల్లాల ప్రజల కష్టాలు చూశాను. ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చి మోసం చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎక్కడ చూసినా అవినీతే…ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సి వస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. మా బాబాయ్‌ని ఇంట్లోకి దూరి చంపిన ఘటన చూశాం’’ అని జగన్‌ చెప్పారు.

ఉద్యోగాలలో 70 శాతం స్థానికులకే దక్కేలా చట్టం చేస్తామని జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని, తమ ఆస్తులను ఎవరూ ఆక్రమించకుండా కఠిన చట్టాలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతుకు గిట్టుబాటు ధర ప్రకటిస్తామని, పెట్టుబడికి సాయం చేస్తామన్నారు. సీఎ: చంద్రబాబు పాలన చూశారని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండని జగన్ కోరారు. ధర్మానికి, అధర్మానికి మధ్యే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని జగన్‌ చెప్పారు.