జాతీయం

ఐదేళ్లలో ఇండియన్ రైల్వేలో భారీ మార్పులు..

రాబోయే ఐదేళ్లలో ఇండియన్ రైల్వేలో భారీ మార్పులు తీసుకొస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహేన్ తెలిపారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల కోసం రూ.115 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. రైల్వే అభివృద్ధి పనుల కోసం రూ.1600 కోట్లు కేటాయించామని మంత్రి స్పష్టం చేశారు. గత బడ్జెట్ కంటే ఈసారి తెలంగాణ కు బడ్జెట్ లో ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు.  రైల్వే ప్రయాణంలో దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రధాని ఆదేశించారని ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిగ్నల్ వ్యవస్థను మార్చడంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచుతామని మంత్రి స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయని రైల్వే శాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు.