తెలంగాణ

ఐటీ దాడులు రాజకీయ కక్ష సాధింపే…

రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యగానే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ… రెండో రోజు కూడా రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతుండగా… రేవంత్ నివాసానికి వెళ్లిన డీకే అరుణ… ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అధికార పక్షాన్ని గట్టిగా ఎదురించే ప్రతిపక్ష నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన డీకే అరుణ… ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే వారికి ఇలాంటి పరిణామాలు తప్పవన్న కోణంలో చర్యలు తీసుకుంటున్నారని… ప్రతిపక్షం లేకుండా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించాలని యోచిస్తోందని… తెలంగాణ ప్రజలు తమ దయాదాక్షిణ్యాల మీద బతకాలనే ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై కేసులు బనాయిస్తోందని ఆరోపించిన డీకే అరుణ దేశంలో సంచలనం సృష్టించిన సహారా కేసులో కేసీఆర్‌ని ఎందుకు ప్రశ్నించలేదు?  బీజేపీ అండదండలు ఉండడంతో కేసీఆర్‌ని ప్రశ్నించ లేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.