ఆంధ్రప్రదేశ్క్రైమ్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు!

  • తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చిన ఏపీ సీఎం
  • పోలీసులను ఆశ్రయించిన టీఆర్ఎస్ నేతలు
  • తమ మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం

‘ఐటీ గ్రిడ్స్’ కంపెనీ డేటా చోరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య కాకరేపుతోంది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసు నమోదయింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో పోలీసుల సోదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రవాదులతో పోల్చారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత దినేశ్ చౌదరి ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన వ్యాఖ్యలతో చంద్రబాబు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రతిష్టను, ఇమేజ్ ను దెబ్బతీసేలా వ్యవహరించిన చంద్రబాబుపై కేసు నమోదుచేయాలని పోలీసులను ఫిర్యాదుతో కోరారు