ఆంధ్రప్రదేశ్

ఏపీ ఈసెట్‌ ఫలితాల విడుదల

విజయవాడ : జేఎన్‌టీయూ (అనంతపురం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్‌-2019 ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. 37,066 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు వెల్లడించారు.