ఆంధ్రప్రదేశ్

ఏపీలో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు

వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సచివాలయంలో పలు బ్లాక్‌లలో గదులను కేటాయించారు. రెండో బ్లాక్
లోని 215 నంబర్‌ గదిని డిప్యూటీ సీఎం, రెవిన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కేటాయించారు. వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబుకు 208, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు 135, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు 137,  హోంమంత్రి మేకతోటి సుచరితకు 136,  విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి 211,  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌కు 212 గదులను కేటాయించారు.

మూడో బ్లాక్‌లోని గది నంబర్‌ 203 ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్ప శ్రీవాణికి కేటాయించారు. ఉపముఖ్యమంత్రి, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అంజద్‌ బాషాకు 212, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు 211, కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరామ్‌కు 207, పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌కు 210 నంబర్‌ గదులను కేటాయించారు.
నాలుగో బ్లాక్‌లోని గది నంబర్‌ 127ను ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామికి కేటాయించారు. గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజుకు 211, పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నానికి 130, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు 210, మత్స్యశాఖ మంత్రి వెంకటరమణకు 132, జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌కు 212, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి 208, బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎం.శంకరనారాయణకు 131 ను కేటాయించారు.

ఐదో బ్లాక్‌లోని గది నెంబర్‌ 191ను ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనానికి కేటాయించారు. రోడ్లు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు 193, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితకు 210, రవాణా, సమాచార శాఖమంత్రి పేర్ని నానికి 211, పంచాయతీ రాజ్‌, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 188 గదిని కేటాయించారు.