ఆంధ్రప్రదేశ్

బెజవాడలో ఎర్రజెండాలు..

విజయవాడ : బెజవాడ నగరం ఎరుపెక్కింది. ఎర్రజెండాలు ఎత్తిపట్టిన సైన్యం నగరంలో కదం తొక్కారు. కేంద్రంలో కార్పొరేట్ కొమ్ముకాస్తూ జనం నడ్డి విరుస్తున్న కాషాయ కూటమిని కూల్చేందుకు అశేష ప్రజానీకాన్నీ ఉత్తేజపరుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు తొలి అడుగు వేశారు.

మండే ఎండను సైతం లెక్కచేయకుండా కిలోమీటర్ల దూరం మహాగర్జన ప్రజాప్రదర్శన నిర్వహించారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం విజయవాడలో మహాగర్జన బహిరంగసభ నిర్వహించారు. సభలో సిపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు మాట్లాడారు.