అంతర్జాతీయం

ఎఫ్‌-16 కూలింది…సాక్ష్యమిదే!

దిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళం కూల్చేసిందనడానికి ఆధారాలను ఐఏఎఫ్‌ సోమవారం బయటపెట్టింది. దీనికి సంబంధించిన రాడార్‌ ఇమేజ్‌ను ఎయిర్‌ వైస్‌ మార్షల్ ఆర్‌జీకే కపూర్‌ విడుదల చేశారు. దీంతోపాటు తమ వద్ద రేడియో టెలిఫోనీ ఇంటర్సెప్ట్స్‌ రూపంలో కూడా ఆధారాలున్నాయని భారత వైమానిక దళం పేర్కొంది. సెక్యూరిటీ కారణాల వల్ల వాటిని ప్రస్తుతం బహిరంగ పరచలేమని తెలిపింది. సరిహద్దు నియంత్రణ రేఖ పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన ఇమేజ్‌ను భారత వాయుసేన బయటపెట్టింది.