ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షిస్తున్న తెలుగు యువత..

రిపోర్టర్:(బి.నాగేశ్వరరావు):జి.కొండూరు:(ప్రజాపాలన):ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల రీత్యా మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు గెలుపుకోసం,అత్యధిక మెజార్టీ కోసం జి.కొండూరు మండల తెలుగు యువత జిల్లా కార్యదర్శి అంకేం సురేష్ యువతను ఆకర్షిస్తూ అత్యధిక మెజార్టీ కోసం జి.కొండూరు మండల తెలుగు యువత జిల్లా కార్యదర్శి సురేష్ యువతను ఆకర్షిస్తూ,ఓటర్లను ఆర్జించటంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. గ్రామ మండల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ,బైక్ ర్యాలీతో యువతను ఉత్తేజపరుస్తూ,ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఒక్కరికి విపులంగా వివరిస్తూ,ఓటర్లను ఆకర్షించడంలో అంకేం సురేష్ ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. ఓటర్లను గతంలో చేర్పించడంలో గానీ, నూతనంగా తెలుగుదేశం పార్టీలోకి పలు పార్టీల వ్యక్తులు టిడిపిలోకి రప్పించడంలో గాని,అంకేం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావుని 30 వేల మెజార్టీతో గెలిపించుకొని,చంద్రబాబుకి కానుకగా ఇస్తామని చెబుతూ మెజార్టీ కోసం కృషి చేస్తున్నట్లు అంకేం చెబుతుండటం విశేషం.ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జి.కొండూరు మండల ఇంచార్జ్ రాము ఎన్నికల ప్రచార కార్యక్రమాలను  నిర్వహిస్తూ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉయ్యురు నరసింహ రావుతో కలిసి గ్రామ కమిటీ సమావేశాలు,మండల పార్టీ సమావేశాలు,ఏర్పాటు చేస్తూ గ్రూపులు లేకుండా అందరిని ఐక్యత పరుస్తూ ఎన్నికల్లో ఎలా పాల్గొనాలి,అందరు ఐక్యతగా కలిసి,మెలిసి అభ్యర్థి గెలుపు కోసం,మెజార్టీ కోసం ఎలా పని చేయాలనే విషయాలను కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ ఉండటంపై ఉమా గెలుపు తధ్యమని,మెజార్టీ కూడా బాగా వస్తుందని,కార్యకర్తలు గట్టి భరోసాతో వున్నారు.దేవినేని ఉమామహేశ్వరరావు నామినేషన్ సందర్భంగా అత్యధిక మంది యువతను మైలవరం తరలించి అభ్యర్థికి సంఘీభావం తెలిపేటందుకు యువత జిల్లా కార్యదర్శి అంకేం సురేష్ మండల ఇంచార్జ్ రాముతోనూ, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉయ్యురు నరసింహారావుతోనూ కార్యక్రమం నిర్వహించేటందుకు ముందుకు సాగుతున్నారు.