సినిమా

ఎన్టీఆర్ చిత్రం లో తాజాగా మరొక దర్శకుడు..

నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా బాలక్రిష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’.  ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్యే పోషిస్తున్నాడు.  ఎన్టీఆర్ యొక్క సినీ జీవితానికి సంబంధించి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలుంటాయట.  వాటిలో అప్పటి దర్శకుల పాత్రలను ఇప్పటి తరం దర్శకులు పోషిస్తున్నారు.

అలా పాత్రలు చేస్తున్న వారిలో క్రిష్ కూడ ఒకరు కాగా తాజాగా మరొక దర్శకుడు ఎన్. శంకర్ కూడ ఈ జాబితాలో చేరారు.  శంకర్ ఇందులో దర్శక దిగ్గజం విఠలాచార్య పాత్రను చేస్తున్నారట.  ఈ మేరకు పనులు కూడ మొదలయ్యాయని తెలుస్తోంది.  రానా చంద్రబాబు నాయుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.