జాతీయం

ఎదురుకాల్పుల్లోఆర్మీ మేజర్‌ మృతి

జమ్మూకశ్మీర్‌లో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్‌ అమరుడయ్యారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. అనంత్‌నాగ్‌ జిల్లా అచ్‌బల్‌ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. గాయపడిన వారిని శ్రీనగర్‌లో ఆర్మీకి చెందిన 92 బేస్‌ ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.