జాతీయం

ఎంపీ వాహనాన్నే క్యూలో రమ్మంటారా?

హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ..తమ కార్యకర్తలకు తెలిపి రెండు రోజులు కాకముందే మరో ఘటన చోటు చేసుకుంది. భాజపా ఎంపీ రామ్‌ శంకర్‌ కథేరియా బాడీగార్డులు.. టోల్‌ గేట్‌ సిబ్బందిపై దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టోల్‌ గేట్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఎంపీ, జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్ రామ్ శంకర్‌ దిల్లీ నుంచి ఆగ్రాకు బయల్దేరారు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో రెహాన్‌ కాలా వద్ద ఉన్న టోల్‌ ప్లాజా వద్దకు రాగానే అక్కడి సిబ్బంది వాహనాన్ని ఆపారు. క్యూ లైన్లో  రావాల్సిందిగా ఎంపీ డ్రైవర్లను కోరారు. ఇందుకు నిరాకరించిన బాడీగార్డులు టోల్‌ సిబ్బందితో వాదనకు దిగారు. సిబ్బందిపై దాడికి దిగారు. దీంతో ఎంపీ, ఆయన బాడీగార్డుల మీద టోల్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.