తెలంగాణ

ఉపాధి పనుల్లో విషాదం.. ఏడుగురి మృతి

నారాయణపేట: నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మరికల్‌ మండలంలో ఏడుగురు ఉపాధి కూలీలు మృతిచెందారు. పీలేరులో ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టిపెల్లలు విరిగిపడడంతో ఏడుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.