సినిమా

ఉగాది నాడు కొత్త పోస్టర్ల కళ!

హైదరాబాద్‌: ఎన్నో ఆశలు, లక్ష్యాలతో నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది హిట్టు కొట్టాలనే ఉద్దేశంతో అనేక సినిమాలు థియేటర్‌లో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాయి. కాగా ఉగాది పర్వదినాన ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్లను విడుదల చేశారు. వాటిని ఓ సారి చూద్దాం..
బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘రాక్షసుడు’. తమిళ హిట్‌ ‘రాక్షసన్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం శనివారం ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసింది. ఇందులో బెల్లంకొండ, అనుపమ, ఓ చిన్నారి హంతకుడిని చూస్తూ కనిపించారు. రమేశ్‌ వర్మన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మాత.